జర్నలిస్టులకు గుడ్ న్యూస్: ఈసారి ఎక్కువగానే అక్రిడిటేషన్ కార్డులు
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య తగ్గుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన సుమారు 23 వేల కార్డుల కంటే.. ఈసారి ఎక్కువగానే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం సచివాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. … Read more