మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరవాసులకు జలమండలి (HMWSSB) కీలక హెచ్చరిక జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 36 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుందని ప్రకటించింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2లో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతుండటమే ఇందుకు కారణం.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జలమండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 10వ తేదీ (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి జనవరి 11వ తేదీ (శనివారం) సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
నీళ్లు రాని ప్రాంతాల జాబితా ఇదే: రిపేర్ పనుల కారణంగా కింది ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోనుంది:
- వనస్థలిపురం, ఆటోనగర్: వైశాలీనగర్, నాగోల్, ఆటోనగర్ రిజర్వాయర్ ప్రాంతాలు.
- బడంగ్పేట్, ఆదిభట్ల: లెనిన్ నగర్, కమ్మగూడ రిజర్వాయర్ పరిధి.
- బాలాపూర్: బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్, మైసారం.
- నాచారం: యెల్లుగుట్ట రిజర్వాయర్ పరిధి.
- సికింద్రాబాద్ పరిధి: తార్నాక, లాలాపేట, మర్రెడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మహేంద్ర హిల్స్, కంటోన్మెంట్ బోర్డు, ఎంఈఎస్, రైల్వేస్.
- ఇతర ప్రాంతాలు: హష్మత్పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, మధుబన్ (పాక్షికంగా), శాస్త్రిపురం, ప్రశాసన్‌నగర్, నేషనల్ పోలీస్ అకాడమీ.
కారణం ఏంటి? కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై ఏర్పడిన లీకేజీని సరిచేయడం, నాసర్లపల్లి వద్ద జంక్షన్ పనులు, బటర్‌ఫ్లై వాల్వ్‌ల మార్పిడి వంటి పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
