వందేభారత్ ప్రయాణికులకు గమనిక.. ఆ రూట్‌లో మారిన టైమింగ్స్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: కాచిగూడ – యశ్వంతపూర్ (బెంగళూరు) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది. ఈ రైలు రాకపోకల సమయాల్లో (హిందూపూర్ స్టేషన్ వద్ద) స్వల్ప మార్పులు చేసినట్లు ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. యశ్వంతపూర్ నుంచి వచ్చే రైలు (20704) హిందూపూర్‌కు ఇకపై మధ్యాహ్నం 3:55 గంటలకు చేరుకుని 3:57కి బయలుదేరుతుంది. అలాగే, కాచిగూడ నుంచి వెళ్లే రైలు (20703) హిందూపూర్‌కు మధ్యాహ్నం … Read more

మున్సిపల్ పోరు: మీ వార్డు అభ్యర్థి ఎవరు? ఆస్తులెంత? నేరచరిత్ర ఉందా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. నామినేషన్ల ఘట్టం ముగిసి, ఉపసంహరణల పర్వం కూడా పూర్తికావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోగా, ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) ఓటర్లకు కీలక సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి, బరిలో ఉన్న అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, … Read more

Ola, Uber strike today: ఓలా, ఉబెర్, రాపిడో సమ్మె: నేడు చక్రం తిప్పని డ్రైవర్లు..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత వాహన సేవలపై ఆధారపడే ప్రయాణికులకు శనివారం (ఫిబ్రవరి 7) తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్ వంటి సంస్థలకు చెందిన డ్రైవర్లు ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ పేరుతో నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ సేవలకు భారీగా అంతరాయం కలగనుంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన … Read more

నిజామాబాద్‌కు రూ.600 కోట్ల స్కూళ్లు: సీఎం రేవంత్ శంకుస్థాపన..

మన పత్రిక వెబ్​డెస్క్, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. “ప్రజాపాలన – ప్రగతిబాట” కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ. 200 కోట్ల చొప్పున, మొత్తం రూ. 600 కోట్లతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ … Read more

హైదరాబాద్‌ను ‘గ్లోబల్ ఫిల్మ్ హబ్’గా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ … Read more

TG Vehicle Registration : ఆర్టీవో ఆఫీసుతో పనిలేదు.. ఇకపై షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇకపై రిజిస్ట్రేషన్ కష్టాలు తప్పనున్నాయి. ఇప్పటి వరకు వాహనం కొంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) మాత్రమే షోరూమ్‌లో జరిగేది, శాశ్వత రిజిస్ట్రేషన్ (PR) కోసం వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ జనవరి 23 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రకారం, ఇకపై మీరు వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే … Read more

Bank holiday: నేటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు.. ఏయే తేదీల్లో అంటే?

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: బ్యాంకు పనుల నిమిత్తం శాఖలకు వెళ్లాలనుకునే వినియోగదారులకు ముఖ్య గమనిక. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. నేడు (జనవరి 24) నెలలో నాలుగో శనివారం కావడంతో నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీంతో ఈరోజు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. కేవలం ఈ ఒక్కరోజే కాకుండా రాబోయే రెండు రోజులు కూడా బ్యాంకులకు హాలీడే ఉండటంతో కస్టమర్లు తమ … Read more

Veldanda: నూతన సీఐగా రఘువీర్ రెడ్డి.. బాధ్యతల స్వీకరణ

మన పత్రిక వెబ్​డెస్క్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రఘువీర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తించిన విష్ణువర్ధన్ రెడ్డికి మల్టీ జోన్ 2 ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లాలో పనిచేసి బదిలీపై వచ్చిన రఘువీర్ రెడ్డి నూతన సీఐగా చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో … Read more

KTR: సిట్ విచారణకు కేటీఆర్ తప్పు చేయలేదు.. రేవంత్ రెడ్డిని, ఆ పోలీసులను వదిలిపెట్టం!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. అంతకంటే ముందు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తామని, తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశామే తప్ప, ఎప్పుడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదని, ప్రత్యర్థుల … Read more

యూఏఎన్ నంబర్ మర్చిపోయారా? నిమిషాల్లో ఇలా తెలుసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్: I Forgot my UAN number – ద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా ఎంతో ముఖ్యం. భవిష్యత్ అవసరాలకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ఖాతాను ఆపరేట్ చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, కేవైసీ అప్డేట్ లేదా క్లెయిమ్ చేసుకోవడానికి 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అత్యంత కీలకం. ఈ ఒక్క నంబర్ లేకపోతే పీఎఫ్ సేవలను ఆన్‌లైన్‌లో పొందడం అసాధ్యం. … Read more