ధర్మపురి ఆలయాల్లో చోరీ.. వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం నిత్య పూజల కోసం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన అర్చకులు, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వెండి ప్రాణ వట్టం, అమ్మవారి వెండి ముఖ కవచాన్ని … Read more