మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు కీలక పదవి

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత కొణిదెల సుస్మితకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యత ద్వారా సుస్మిత ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ సమగ్ర అభివృద్ధి, … Read more

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖలో 7,437 పోస్టులకు జూలై 29న ప్రభుత్వం 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 9వ తేదీతో ముగియాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో వారం రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థులు ఇకపై సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు … Read more

బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అరెస్ట్

హైదరాబాద్‌: రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అక్రమ అరెస్టులతో … Read more

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టు

TELANGANA POLITICS: సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కోకాపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్‌ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి, వీరిద్దరిని నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులకు, … Read more

మహబూబాబాద్‌: భర్త ఫోన్ ఎత్తలేదని భార్య సూసైడ్

మహబూబాబాద్‌ క్రైం: భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల(20)కు, మహబూబాబాద్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్ బాణోత్ హుస్సేన్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన అఖిల.. పాప ఏడుస్తుండటంతో భర్తతో మాట్లాడించేందుకు ఈ … Read more

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

TELANGANA POLITICS: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత మోగించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నర్సారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దూరానికి చేరుకుని నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లడంతో పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగి, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతు దీక్ష చేపట్టాయి. … Read more

AP మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో 913 ఆశావర్కర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తాజాగా మరో 913 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ‘డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా: MLC తాతా మధు

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆయన స్పీకర్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ వివాదం ముప్పేట దాడిలా మారుతుండటంతో తాతా మధు స్పందించాల్సి వచ్చింది. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను స్పీకర్‌ను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు అనలేదని, … Read more

విజయ్-రష్మిక ‘రణబాలి’ టీజర్ అప్‌డేట్

సినిమా: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహబంధం తర్వాత జంటగా నటిస్తున్న తొలి భారీ పాన్ ఇండియా పిరియాడిక్ డ్రామా ‘రణబాలి’. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 1854 నుండి 1878 మధ్య బ్రిటిష్ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా నటిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ … Read more

తెలంగాణలో ఓటర్ల సవరణ గడువు పొడిగింపు

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మరోసారి సవరించింది. ఓటర్ల నమోదు, క్లెయిమ్‌లు అలాగే అభ్యంతరాల స్వీకరణ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సవరించిన తాజా షెడ్యూల్ ప్రకారం.. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే ప్రక్రియను నవంబర్ 5 లోపు పూర్తి చేయనున్నారు. అన్ని ప్రక్రియలు … Read more