గుంటూరు: ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు

AP CRIME: అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లినే కూతురు ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన మక్కెన వేంకటేశ్వరమ్మ (48) కుమార్తెకు వివాహమై పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల వల్ల తల్లి వద్దే నివాసముంటున్న ఆమెకు శ్రీనివాసరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. గత కొన్ని రోజులుగా తల్లి వీరి ప్రవర్తనను తీవ్రంగా ఖండించడమే కాకుండా … Read more

జొమాటో కస్టమర్లకు మరో షాక్!

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ రకాల ఛార్జీలతో జేబులు గుల్ల చేస్తున్న ఆ సంస్థ.. తాజాగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఎంచుకునే కస్టమర్లపై అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు వసూలు చేయడం మొదలుపెట్టింది. బిల్లు సమ్మరీలో ఈ ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ ప్రత్యేకంగా కనిపిస్తుండటం గమనార్హం. డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ఈ భారం ఉండదు కానీ, … Read more

శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల వివరాలు వెల్లడి

TTD: తిరుమల శ్రీవారి డిసెంబర్‌ నెల ఆర్జిత సేవల టికెట్ల ఆన్‌లైన్ విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానంప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో ఎంపికైన భక్తులు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము … Read more

విజయనగరం: మరోసారి కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్సీ బొత్స

AP: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి బహిరంగంగా భావోద్వేగానికి గురయ్యారు. విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండగా ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఇటీవల ఆయన మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరిన పరిణామాల నేపథ్యంలోనే ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయగా.. సమావేశంలో ఈ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. నిన్న సోషల్ … Read more

బస్సు ప్రమాదం.. క్లీనర్ మృతి, 24 మందికి గాయాలు

CRIME: చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ‘జగన్ ట్రావెల్స్’కు చెందిన ప్రైవేట్ బస్సు యండపల్లి వద్ద నిలిపి … Read more

యూట్యూబర్‌ రమానందనకు మరోసారి నోటీసులు

అద్దంకి: యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కన్సల్టెన్సీ ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో నిందితురాలైన రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం పేరాయపాలేనికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాసరావు తన కోడలికి యూకేలో ఉద్యోగం కోసం గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న జె.మోహనరావును 2023లో సంప్రదించారు. ఈ క్రమంలో మొదట అడ్వాన్స్‌గా రూ.లక్ష, పత్రాల పరిశీలన పూర్తయ్యాక మరో రూ.9.60 లక్షలు కలిపి … Read more

వర్ష సూచన.. 18 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని స్పష్టం చేసింది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏపీలో అల్పపీడనం కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు … Read more

నేడు విజయనగరం జిల్లాలోని పాఠశాలలకు సెలవు

విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని వెంటనే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని డీఈఓ సూచించారు. వర్షాల కారణంగా నేడు నిర్వహించాల్సి ఉన్న కాంపెన్సేటరీ పని దినాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. LavanyaLavanya is … Read more

BREAKING: కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం కారణంగా తునిలో అలంక ఎక్స్‌ప్రెస్‌, అన్నవరంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌, సామర్లకోటలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, అనకాపల్లిలో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు … Read more

కర్నూలు జిల్లాలో భూకంపం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం హఠాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కర్నూలు నగరం సహా ఆదోని, దాని పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇళ్లలోని పాత్రలు, వస్తువులు భయంకరమైన శబ్దాలతో కదిలిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు, ఖాళీ ప్రదేశాల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్లు భూకంపశాఖ అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. భూ అంతర్భాగంలో జరిగిన చిన్నపాటి సర్దుబాట్ల … Read more