మన పత్రిక, ఏపీ రాయజకీయం: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. గతంలో విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అంశంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలోనూ వైఖరి మారిందని, గతంలో వ్యతిరేకించి ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం సరైంది కాదన్నారు. ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్టును కూడా తానే తీసుకొచ్చానని చెప్పుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రజలు వైఎస్సార్సీపీని 11 సీట్లకే పరిమితం చేసినా జగన్‌లో మార్పు లేదన్నారు. త్వరలో పార్టీ రాష్ట్రంలో కనుమరుగవుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన త్వరలోనే జరగనుందని తెలిపారు. జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభమై ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
