అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య మరియు ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు కాంబినేషన్లో వస్తున్న మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్ నిన్న (మార్చి 5) ఘనంగా విడుదలైంది. గ్లింప్స్ చూస్తుంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక విజువల్ వండర్ అనిపిస్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న విజువల్స్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి.
ఈ సినిమాలో నాగ చైతన్య ‘అర్జున్’ అనే ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపిస్తున్నారు. గ్లింప్స్ ప్రారంభంలోనే ఒక భయానక వాతావరణాన్ని పరిచయం చేశారు. “అపరిమితమైన శక్తి మేల్కొన్నప్పుడు.. సృష్టి తన మార్గాన్ని తప్పినప్పుడు.. విధి తన స్వంత గమనాన్ని ఎంచుకుంటుంది” అనే వాయిస్ ఓవర్ సినిమా థీమ్‌ను స్పష్టం చేస్తోంది. చైతన్య తన 15 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంత రగ్గడ్ లుక్‌లో, కత్తులతో యుద్ధం చేస్తూ కనిపిస్తుండటం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
ఈ గ్లింప్స్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ. అతను ఒక మంత్రగాడిగా, భయంకరమైన డ్రాయింగ్స్ వేస్తూ, శక్తులను ఆవాహన చేసే సీన్లు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరి ‘దక్ష’ పాత్రలో మెరవగా, జయరామ్ గారు ప్రొఫెసర్ రంగనాథ్ పాత్రలో కనిపించారు. అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో నాగ చైతన్య మాట్లాడుతూ.. “వృషకర్మ నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది. కార్తీక్ దండు విజన్ నన్ను ఆశ్చర్యపరిచింది” అని ధీమా వ్యక్తం చేశారు. సుకుమార్ రైటింగ్స్ మరియు బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2026 ద్వితీయార్థంలో విడుదల కానుంది. థ్రిల్లర్ మరియు మైథాలజీని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడం ఖాయం.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
