మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులందరికీ ‘ప్రశస్త్ 2.0’ మొబైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా దివ్యాంగ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి. శ్రీనివాసరావు ప్రకటించారు. పిల్లల్లో ఉండే 21 రకాల దివ్యాంగత్వాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు 100 శాతం స్క్రీనింగ్ పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ యాప్‌ను యుడైస్ ప్లస్ (UDISE+) తో అనుసంధానించారు. క్లాస్ టీచర్లు ప్రతి విద్యార్థికి ‘పార్ట్-1’ స్క్రీనింగ్ పూర్తి చేశాక, అవసరమైన చోట స్పెషల్ ఎడ్యుకేటర్లు ‘పార్ట్-2’ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ ప్రక్రియ టైమ్‌లైన్:
- జూన్ – జూలై: హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ ద్వారా లాగిన్ల సృష్టి, యాక్టివేషన్ పూర్తి చేయాలి.
- ఆగస్టు: క్లాస్ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేటర్ల ద్వారా మ్యాపింగ్, అసైన్మెంట్ ప్రక్రియ ముగించాలి.
- సెప్టెంబరు: సాధారణ ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులందరికీ ‘పార్ట్-1’ స్క్రీనింగ్ పూర్తి చేయాలి.
- అక్టోబరు: స్పెషల్ ఎడ్యుకేటర్ల ద్వారా ‘పార్ట్-2’ స్క్రీనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
- June 16 Gold Rates | ఈరోజు బంగారం ధరలు
