సినిమా: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహబంధం తర్వాత జంటగా నటిస్తున్న తొలి భారీ పాన్ ఇండియా పిరియాడిక్ డ్రామా ‘రణబాలి’. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 1854 నుండి 1878 మధ్య బ్రిటిష్ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా నటిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగం పెంచిన చిత్రబృందం తాజాగా నెట్టింట కీలక అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 9న ‘రణబాలి’ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక పవర్ఫుల్ ప్రోమోను వదిలింది. “శాపగ్రస్త భూమికి సంబంధించిన రహస్య పురాణగాథ ఉద్భవిస్తోంది” అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో వదిలిన ఈ ప్రోమో విజయ్, రష్మిక అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
