Advertisement

అన్నమయ్య: సెలవు కోసం తోటి విద్యార్థిపై హత్యాయత్నం

AP: పాఠశాలకు సెలవు వస్తుందనే విపరీత ఆలోచనతో ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో వెలుగుచూసింది. బాధితుని తల్లిదండ్రుల కథనం మేరకు… వారం క్రితం అర్ధరాత్రి 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి నిద్రిస్తుండగా, ఇద్దరు తోటి విద్యార్థులు దిండుతో ముఖంపై అదిమి, గొంతు నొక్కేందుకు యత్నించారు. బాధితుడు వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. భయభ్రాంతులకు గురైన విద్యార్థి సమాచారం అందించడంతో తల్లిదండ్రులు అతడిని ఇంటికి తీసుకెళ్లారు. ఘటనను పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై మండిపడ్డారు. దీనిపై ఎంఈవో రెడ్డిబాషా విచారణ జరిపారు. పాఠశాలకు సెలవు లభిస్తుందనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు తేలిందన్నారు. దాడికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించినట్లు ఎంఈవో వెల్లడించారు.

Advertisement