Advertisement
telangana news

TG News: టోల్ ప్లాజా వద్ద కారు పల్టీ – 100 కిలోల గంజాయి

మన పత్రిక, వెబ్​డెస్క్: మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఓ కారు పల్టీ కొట్టింది. పోలీసులు తనిఖీ చేస్తుండగా, డ్రైవర్ తప్పించుకోవాలని ప్రయత్నించి, ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనం తనిఖీ చేశారు. దానిలో 100 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు ₹15 లక్షలు. పట్టుబడిన వారిని తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement