మన పత్రిక, వెబ్డెస్క్: మొంథా తుఫాన్ వర్షాలు, ఎగువ ప్రాంత వరదతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. గురువారం బ్యారేజీలోకి 4.20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి ప్రవాహం 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది.
పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 4.90 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, కీసర, వైరా వంటి ఉపనదుల నుంచి మరో 2 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతోంది. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బ్యారేజీ వద్ద పరిస్థితిని సమీక్షించారు. బ్యారేజీ దిగువనున్న లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి, సహాయక చర్యలకు సిద్ధమయ్యారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
