మన పత్రిక, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా (Medak District) టేక్మాల్ పోలీస్ స్టేషన్లో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై రాజేష్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై, వారి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి సమీపంలోని పంట పొలాల్లోకి పరుగులు తీశారు.
వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు, సినిమా ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఎస్సైని పట్టుకున్నారు. ఎస్సై రాజేష్ ఏసీబీకి చిక్కారన్న వార్త తెలియగానే, గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
