Jubilee Hills by poll | 170 మంది రౌడీషీటర్ల బైండోవర్!

Jubilee Hills by poll

మన పత్రిక, వెబ్​డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో, నియోజకవర్గ పరిధిలోని 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. వీరిలో అత్యధికంగా బోరబండ ఏరియా నుంచి 74 మంది ఉండటం గమనార్హం. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, పోలీసులు బైండోవర్ … Read more

TG News: భోజన విరామ సమయంలో నిరసన SGTU

sgtu yadadri protest

మన పత్రిక, వెబ్​డెస్క్: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రములో ప్రాథమిక పాఠశాల మహిళా ప్రధానోపాధ్యాయురాలు పై పోలీసు కానిస్టేబుల్ దాడికి నిరసనగా ఈరోజు ప్రాథమిక పాఠశాల బట్టుగూడ గ్రామంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో SGTU YADADRI జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే కరుణ గారులు పాల్గొన్నారు

TG News: హైదరాబాద్‌కు 2,000 బస్సులు కేటాయింపు!

hyderabad 2000 new electric buses

10,900 విద్యుత్ బస్సుల టెండర్.. హైదరాబాద్‌కు 2,000 బస్సులు! మన పత్రిక, వెబ్​డెస్క్: దేశవ్యాప్తంగా పలు నగరాల కోసం 10,900 విద్యుత్ బస్సులను సేకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కన్వెర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) నవంబర్ 6న బిడ్లు ఓపెన్ చేయనుంది. సున్నా ఉద్గారాల ప్రజా రవాణాను ప్రోత్సహించే నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (NEBP) కింద ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ టెండర్ ద్వారా హైదరాబాద్‌తో పాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు … Read more

Indiramma illu: శ్లాబ్ బిల్లు చెల్లింపులో మార్పులు!

tg indiramma housing scheme

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి నుండి, శ్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత గతంలో ప్రకటించినట్లు ₹2 లక్షలు కాకుండా, ₹1.40 లక్షలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకాన్ని ఉపాధి హామీ (90 పనిదినాలు)తో అనుసంధానించడం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఈ మార్పుకు కారణంగా తెలుస్తోంది. మిగిలిన ₹60 వేలను, ఇంటి నిర్మాణం పూర్తయిన … Read more

TG Inter Practicals: గురుకులాలు, కేజీబీవీలలో సెంటర్లు రద్దు!

NO PRACTICAL EXAM CENTRES IN SOCIAL WELFARE and KGBV Colleges

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు, మోడల్ స్కూల్స్ మరియు కేజీబీవీ ఇంటర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలను ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో, ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇకపై సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లోని ప్రాక్టికల్ కేంద్రాలను యథాతథంగా కొనసాగించడం గమనార్హం. కేవలం గురుకులాల్లోని సెంటర్లను ఎత్తివేయడంపై … Read more

Karimnagar: బైక్‌కు 120 చలాన్లు.. రూ. 29 వేల ఫైన్!

Karimnagar 120 bike challans

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శనివారం నగరంలోని కమాన్ ప్రాంతంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా, భారీగా జరిమానాలు బకాయి ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గణేష్ నగర్‌కు చెందిన కట్కోజువాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి హోండా షైన్ (TS22 7090) బైక్‌పై రాంగ్ రూట్‌లో వస్తుండగా పట్టుబడ్డాడు. వాహనాన్ని తనిఖీ చేయగా, దానిపై … Read more

District collector: రైస్ మిల్లర్లకు నల్గొండ కలెక్టర్ ఆదేశం..

nalgonda collector ila tripathi orders rice millers

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణలో భాగంగా, ఇంకా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వని మిల్లర్లు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు తమ మిల్లులలో దించుకోవాలని, ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని ఆమె గట్టిగా సూచించారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్నాయని, దీనివల్ల కొనుగోలు కేంద్రాల్లో లేదా పంటపై ఉన్న ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ … Read more

Nizamabad: ఇరాక్‌లో ఆలూర్ వాసి మృతి.. ప్రభుత్వ సహాయం కోసం కుటుంబం వినతి!

Nizamabad iraq rajesh died

మన పత్రిక, వెబ్​డెస్క్: నిజామాబాద్ జిల్లా ( Nizamabad District ) ఆలూర్ మండల ( Alur Mandal ) కేంద్రానికి చెందిన కుర్మే బీజ చిన్న రాజేష్ (45) గల్ఫ్ దేశం ఇరాక్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, జీవనోపాధి కోసం ఒకటిన్నర సంవత్సరం క్రితం రాజేష్ విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఓ నిర్మాణ పనులు చేస్తుండగా, నిన్న (శుక్రవారం) ప్రమాదవశాత్తు బ్రిడ్జి పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు … Read more

నల్గొండ: చెట్టును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి అక్కడికక్కడే మృతి!

nalgonda gurrampode road accident bike

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా ( Nalgonda District ) గుర్రంపోడు మండల పరిధిలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. జూనుతల స్టేజి వద్ద రహదారిపై ఓ బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఆడెపు వెంకటయ్య (55) బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు … Read more

Bus Accident: పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌పై బస్సు బోల్తా.. 6 మందికి గాయాలు!

pedda amberpet bus accident

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ఈ బస్సు, జంక్షన్ వద్ద అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే డీఆర్డీవో అపోలో, హయత్‌నగర్ ఆస్పత్రులకు తరలించారు. మలుపు వద్ద … Read more