మన పత్రిక, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగిస్తూ, డీఎంకే అధినేత స్టాలిన్ వ్యూహాత్మక మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని సాధించారు. అన్నాడీఎంకేకు అధికారం దక్కకుండా చేయడంలో స్టాలిన్ చదరంగం పక్కాగా పనిచేసింది.

ఈ కొత్త కేబినెట్‌లో మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. విజయ్ ఒక సీటు ఖాళీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో, అక్కడ నటి త్రిష కృష్ణన్‌ను నిలబెట్టి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి. బీజేపీని ఒకే స్థానానికే పరిమితం చేసిన స్టాలిన్, తన వారసుడు ఉదయనిధి కోసం పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, చిన్న పార్టీల మద్దతుతో ఏర్పడిన ఈ సర్కారు నిలకడపై సందేహాలు వ్యక్తమవుతుండగా, ఏడాదిలోపే మళ్లీ ఎన్నికలు వస్తాయని వేణుస్వామి అంచనా వేయడం గమనార్హం.
