Advertisement

మద్యం తాగి వాహనం నడిపిన డేవిడ్ వార్నర్కు జైలు శిక్ష

మన పత్రిక: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మద్యం తాగి వాహనం నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న సిడ్నీలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తాగి వాహనం నడపడం తప్పని వార్నర్ కోర్టులో అంగీకరించినప్పటికీ, న్యాయస్థానం దీనిని తీవ్రంగా పరిగణించింది.

ఈ కేసులో భాగంగా డేవిడ్ వార్నర్కు తొమ్మిది నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనితో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ నిషేధం మరియు 2200 ఆస్ట్రేలియా డాలర్ల జరిమానాను కూడా కోర్టు విధించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఆగస్టు 18 నుండి వార్నర్ ఈ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement