తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. తాజా రేట్లు ఇవే

మన పత్రిక, హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. ఈ తాజా పెంపుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు కలిగిన ప్రాంతాలుగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో లీటరు ఇంధనంపై కనీసం రూ. 3 వరకు అదనపు భారం పడింది.

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 3.39 పెరిగి రూ. 110.89కి చేరగా, డీజిల్ రూ. 98.96 వద్ద ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ. 113.03, డీజిల్ రూ. 100.71కి పెరిగింది. విశాఖపట్నం, గుంటూరు, కర్నూల్, తిరుపతి, కాకినాడ ప్రాంతాల్లోనూ డీజిల్ ధర రూ. 100 మార్కును తాకింది. వరంగల్, నల్గొండ, సిద్ధిపేట వంటి నగరాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. దిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ ధరలకు రెక్కలొచ్చాయి.