Advertisement

సీజేపీ ఆందోళనపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరణ

మన పత్రిక: ఢిల్లీలో సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనపై పోలీసుల చర్యల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీక్ ఘటనలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు జరిపిన బలప్రయోగాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

పిటిషనర్ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీంకోర్టు, ప్రతి చిన్న విషయాన్ని అత్యవసరంగా కోర్టుల దృష్టికి తీసుకురావద్దని సూచించింది. ఈ కేసు విచారణ న్యాయస్థానం నిర్ణయించిన సాధారణ ప్రక్రియ ప్రకారమే జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement
Advertisement