Advertisement

హైదరాబాద్‌లో ఉద్రిక్తత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాంచందర్ రావు నేతృత్వంలో బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

శాంతిభద్రతల పేరుతో పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రాంచందర్ రావుతో పాటు పలువురు కీలక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో నాంపల్లి పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. అప్రమత్తమైన పోలీసులు అక్కడ భారీగా బలగాలను మోహరించారు.

Advertisement
Advertisement