మన పత్రిక: చేతికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి చిత్రీకరణలో పాల్గొననున్నారు. అయితే ఈలోగా సినిమా నిర్మాణంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ రెండో వారం నుంచి డ్రాగన్ తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలతో పాటు, ఇతర ప్రధాన నటీనటులపై ముఖ్యమైన టాకీ భాగాలు, కాంబినేషన్ సీన్లను చిత్రీకరించాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ కోలుకున్న వెంటనే ఆయనకు సంబంధించిన ప్రధాన ఘట్టాల షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
సాధారణంగా ప్రశాంత్ నీల్ చిత్రాలు డార్క్ టోన్, నలుపు-గ్రే రంగులతో కూడిన విజువల్స్‌తో ఉంటాయి. అయితే డ్రాగన్ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఘట్టాలను మాత్రం భిన్నంగా, ఎంతో కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
