WhatsApp
Advertisement

NHPC Trainee Engineer Recruitment 2026: ఎన్‌హెచ్‌పీసీలో 81 ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీ

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్: భారత ప్రభుత్వ పరిధిలోని నవరత్న సంస్థ అయిన ఎన్‌హెచ్‌పీసీ (NHPC) లిమిటెడ్, సివిల్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలుసమాచారం
సంస్థ పేరుఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ (NHPC Limited)
పోస్టుల పేర్లుట్రైనీ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)
మొత్తం ఖాళీలు81 (SRD: 72, PwBD: 9)
విద్యార్హతసంబంధిత బ్రాంచీలో 60% మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 50%). గేట్ (GATE) 2024 లేదా 2025 స్కోరు తప్పనిసరి.
వయోపరిమితిదరఖాస్తు నాటికి గరిష్టంగా 30 ఏళ్లు (నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
వేతనంనెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు (IDA).
ఎంపిక విధానంగేట్ స్కోర్ (75%), గ్రూప్ డిస్కషన్ (5%), పర్సనల్ ఇంటర్వ్యూ (20%) ఆధారంగా.
దరఖాస్తు ఫీజుఓబీసీ (NCL) అభ్యర్థులకు రూ.708. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానంఆన్‌లైన్ ద్వారా (www.nhpcindia.com)
దరఖాస్తు ప్రారంభ తేదీ16 మార్చి 2026
దరఖాస్తులకు చివరి తేదీ06 ఏప్రిల్ 2026
అధికారిక నోటిఫికేషన్ ప్రకారంఎంపికైన వారు కనీసం 4 ఏళ్ల పాటు పనిచేసేలా సర్వీస్ బాండ్ సమర్పించాలి. ఏడాది శిక్షణ అనంతరం ఇంజనీర్/ఆఫీసర్ గా నియమితులవుతారు.

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని సూచించారు.

Advertisement
Advertisement