మన పత్రిక: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 17న మ్యాథమెటిక్స్ పేపర్‌తో ప్రారంభమైన ఈ పరీక్షలు, మార్చి 10న ఫ్రెంచ్ పేపర్‌తో పూర్తయ్యాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు (14 లక్షల మంది బాలురు, 10.9 లక్షల మంది బాలికలు) పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తి కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఫలితాలపై పడింది.
2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫలితాల తేదీని బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గత మూడేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే మే రెండో వారంలో (మే 12 నుంచి 15 తేదీల మధ్య) ఫలితాలు విడుదలయ్యే అవకాశం మెండుగా ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు cbse.gov.in, results.nic.in, results.digilocker.gov.in తదితర అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మార్కులను చూసుకోవచ్చు. అలాగే డిజిలాకర్ (DigiLocker), ఉమంగ్ (UMANG) యాప్స్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేనివారు cbse10 <రోల్ నంబర్> <స్కూల్ నంబర్> <సెంటర్ నంబర్> టైప్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. పాస్ అయిన విద్యార్థులు స్కోరు పెంచుకోవడానికి మూడు సబ్జెక్టుల (సైన్స్, మ్యాథ్స్, సోషల్) వరకు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు. ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారికి ‘కంపార్ట్‌మెంట్’ పరీక్షలు నిర్వహిస్తారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో తప్పితే ‘ఎసెన్షియల్ రిపీట్’ కింద మరుసటి ఏడాది మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
