Advertisement

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ వరదలు: 160 దాటిన మృతుల సంఖ్య

మన పత్రిక: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాలలో సంభవించిన హఠాత్ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి మట్టి, రాళ్లు, నీరు ఒక్కసారిగా విరుచుకుపడటంతో గ్రామాలు, రహదారులు, ఇతర మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భోటే కోషి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది.

తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తులో కనీసం 160 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశాయి. మృతులు, గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారిలో స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు, కార్మికులు కూడా ఉన్నారు. కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు, ట్రెక్కింగ్ చేసేవారు కూడా ఈ ప్రాంతంలో ఉండటంతో ఆందోళన నెలకొంది.

Advertisement

నేపాల్ రెస్క్యూ టీమ్‌లు హెలికాప్టర్లు, అత్యవసర సాధనాల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే, దెబ్బతిన్న రహదారులు, ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన పర్వత ప్రాంతాలు గాలింపు చర్యలకు అడ్డంకిగా మారాయి. మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందేమోనని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయం అందిస్తున్నారు.

Advertisement