Advertisement

ఏపీ చేనేత కళాకారులకు జాతీయ పురస్కారాలు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు చేనేత కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు గాను వీరికి జాతీయ అవార్డులను ప్రకటించారు.

వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావుకు ఉత్తమ మార్కెటింగ్ విభాగంలో ఈ పురస్కారం దక్కింది. అలాగే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మురకల నటరాజ్‌కు చేనేత నైపుణ్యంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆగస్టు 7న నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవం రోజున ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

Advertisement
Advertisement