నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ట్రెయిన్’ సినిమా ట్రైలర్ను నిర్మాత కలైప్పులి ఎస్ థాను శుక్రవారం విడుదల చేశారు. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందింది. కదులుతున్న రైలులో బందీలుగా ఉన్న వారిని రక్షించేందుకు విజయ్ సేతుపతి చేసే ప్రయత్నాలను ట్రైలర్లో చూపించారు.
ఈ చిత్రానికి మిస్కిన్ స్వయంగా సంగీతం అందించారు. ఇందులో నాజర్, శృతి హాసన్, నాజర్, శరత్ కుమార్ లాంటి నటులతో పాటు నారాయణ్, సంపత్ రాజ్, కలైయరసన్ వంటి పలువురు కీలక పాత్రల్లో నటించారు. వి క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
