Advertisement

డిసెంబర్ 4 నుంచి ఓటీటీలో సమ్మర్ హాలిడేస్

థియేటర్లలో విడుదలైన తెలుగు చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా డిసెంబర్ 4 నుంచి సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీకర్ నయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాల్య జ్ఞాపకాలు, పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో రూపొందింది.

ఓటీటీ రిలీజ్ వివరాలు

గోదావరి ప్రాంతంలోని ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ కథలో రోహన్ రాయ్, అరుణ్ దేవ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు. హైదరాబాద్ నుంచి అమ్మమ్మ ఊరికి వచ్చిన బాలుడు ఆర్‌వి, స్థానిక పేద కుటుంబానికి చెందిన కేవి అనే బాలుడి మధ్య ఏర్పడే స్నేహం ఈ చిత్రంలో ప్రధానాంశం. వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, విజిబి ఫిల్మ్స్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement
Advertisement