పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఆకాశంలో ఒక తార చిత్రం ద్వారా నటి సాత్విక వీరవల్లి చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సాత్విక వీరవల్లి నటనను ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు ప్రేక్షకులు ఏ భాషా నటులనైనా ఆదరిస్తారని, అయితే మన తెలుగు అమ్మాయి పెద్ద స్టార్‌గా ఎదగాలని కోరుకుంటామని రాజమౌళి అన్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ తరహాలో తెలుగు నుంచి మరొక నటి ఆ స్థాయికి చేరాలనే కోరిక ఉందంటూ, సాత్వికకు భారతీయ చిత్రసీమలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్రబృందంపై ప్రశంసలు
ఈ సందర్భంగా కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటనను కూడా రాజమౌళి అభినందించారు. దుల్కర్ తన పాత్రతో సినిమాను ముందుకు నడిపించారని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు పవన్ సాధినేని కృషిని, గుణ్ణం గంగరాజు అందించిన స్క్రీన్ ప్లే, సంభాషణలను ఆయన కొనియాడారు. ఈ చిత్రంలో నటించిన శ్రుతి హాసన్, రుహానీ శర్మల పాత్రలను కూడా ఆయన ప్రశంసించారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
