Artificial beach in hyderabad | డిసెంబర్ నుంచి ప్రారంభం, రూ.225 కోట్ల ప్రాజెక్ట్

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. సముద్రం లేని నగరంలో ఇప్పుడు బీచ్ సౌకర్యం రాబోతోంది. కొత్వాల్ గూడ లో ( Hyderabad artificial beach project cost ) రూ.225 కోట్లతో కృత్రిమ బీచ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ( kotwali guda beach ) . ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2024 నుంచి ప్రారంభమవుతుంది.పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో దాదాపు 35 ఎకరాల్లో ఈ కృత్రిమ బీచ్ అభివృద్ధి చేయనున్నారు. ఇది హైదరాబాద్ … Read more

సిద్ధిపేట | పండుగ పూట వర్షంలో యూరియా కోసం రైతుల పోరాటం

మన పత్రిక, వెబ్​డెస్క్ : సిద్ధిపేట ( SIDDIPET ) జిల్లా నంగునూరు మండల ( Nanganoor Mandal ) కేంద్రంలో వినాయక చవితి పండుగ రోజు రైతులు యూరియా బస్తాల కోసం వర్షంలోనే క్యూ కట్టారు. ఉదయం నుంచే వందలాది మంది రైతులు ఆగ్రోస్ కేంద్రం ఎదుట నిలబడ్డారు. కురుస్తున్న భారీ వర్షాన్ని లెక్క చేయకుండా వారు టోకెన్ల కోసం పోటీ పడ్డారు. ఆ రోజు కేంద్రానికి 554 యూరియా బస్తాలు మాత్రమే అందాయి. కానీ … Read more

AP Family Card | ఏపీలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( chandrababu naidu ) రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ( AP FAMILY CARD 2025 ) జారీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ చేరువ చేయడమే ఈ నిర్ణయం లక్ష్యం. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, వారు పొందుతున్న ప్రభుత్వ పథకాల సమాచారం కూడా ఉండనుంది. … Read more

అల్పపీడనం అంటే ఏమిటో తెలుసా..?

మన పత్రిక, వెబ్​డెస్క్ : ”బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల భారీ వర్షాలు పడనున్నాయి.” అని వార్తల్లో పదే పదే వింటుంటాం.. ఇంతకీ అల్పపీడనం అంటే ఏమిటో తెలుసా.. దానికి వర్షాలు పడటానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు తెలుసుకుందాం.. అల్పపీడనం (Low Pressure Area) అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో వాతావరణ పీడనం చుట్టుపక్కల ప్రాంతాల కన్నా తక్కువగా ఉండటాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా వెచ్చని, తేమతో కూడిన గాలి పైకి వెళ్లడం … Read more

బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ కీలక ఆదేశం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనజీవనం అస్తవ్యస్తం కావడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వరద బాధిత ప్రజలకు అండగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పలు జిల్లాల పార్టీ ముఖ్య నాయకులకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించిన కేసీఆర్, వరద ప్రభావిత ప్రాంతాల్లో … Read more

మిజోరాంలో ‘యాచక నిషేధ బిల్లు’కు ఆమోదం

మన పత్రిక, వెబ్​డెస్క్ : మిజోరాం ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు-2025’ను ఆమోదించింది. ఇది కేవలం యాచకులను శిక్షించడం కాకుండా, వారికి సహాయం చేసి, పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వం ‘రిలీఫ్ బోర్డు’ను ఏర్పాటు చేసి, యాచకులను తాత్కాలికంగా ఉంచడానికి ఒక ‘రిసీవింగ్ సెంటర్’ను ప్రారంభిస్తుంది. అనంతరం 24 గంటల్లో వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటారు. అయితే, ఈ బిల్లును … Read more

పోచారం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : అనూహ్యంగా వచ్చిన వరదను తట్టుకొని నిలబడిన పోచారం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం 70 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నప్పటికీ, 1,82,000 క్యూసెక్కుల భారీ వరదను కూడా డ్యామ్ బలంగా తట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇది తమ శాఖకు భారీ ఉపశమనం కలిగించిందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ రామకృష్ణారావు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, … Read more

సిద్దిపేట: కోమటిచెరువు పొంగడంతో పలు కాలనీలు జలదిగ్బంధం

మన పత్రిక, వెబ్​డెస్క్ : సిద్దిపేట ( SIDDIPET ) పట్టణంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( SIDDIPET RAINS ) జనజీవనం అస్తవ్యస్తమైంది. కోమటిచెరువు పొంగి పొర్లుతుండటంతో పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్, శ్రీనివాస నగర్, సీతారామంజనేయ టాకీస్ ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో మునిగాయి. మత్తడి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. పలు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఇళ్లలోనే … Read more

సిద్దిపేట: వరదలో చిక్కుకున్న రైతులు

మన పత్రిక, వెబ్​డెస్క్ : సిద్దిపేట ( SIDDIPET ) జిల్లా దుబ్బాక ( DUBBAKA ) నియోజకవర్గంలోని అక్బర్‌పేట, భూంపల్లి మండలాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. పోతరెడ్డిపేట పెద్ద చెరువు నుంచి మత్తడి ప్రవాహం భారీగా వస్తోంది. చిన్న నిజాంపేట వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులు అకస్మాత్తుగా వరద నీటిలో చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో రైతుల … Read more