మన పత్రిక, వెబ్‌డెస్క్ : మిజోరాం ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు-2025’ను ఆమోదించింది. ఇది కేవలం యాచకులను శిక్షించడం కాకుండా, వారికి సహాయం చేసి, పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వం ‘రిలీఫ్ బోర్డు’ను ఏర్పాటు చేసి, యాచకులను తాత్కాలికంగా ఉంచడానికి ఒక ‘రిసీవింగ్ సెంటర్’ను ప్రారంభిస్తుంది. అనంతరం 24 గంటల్లో వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటారు.
అయితే, ఈ బిల్లును ప్రతిపక్షం వ్యతిరేకిస్తోంది. ఈ చట్టం రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు, క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమని ప్రతిపక్ష నేత లాల్చందమ రాలే పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి లాల్దుహోమా మాట్లాడుతూ.. ఈ బిల్లు ఉద్దేశ్యం శిక్షించడం కాదని, వారికి సహాయం చేయడం ద్వారా మిజోరాంను యాచకులు లేని రాష్ట్రంగా మార్చడమే అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
