నిర్మల్: పురుగు మందు తాగి సర్పంచ్ సూసైడ్

మన మత్రిక, TG క్రైం: నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి దురదృష్టకర పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం లహరి పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి వేగంగా తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలో కారు అదుపుతప్పి రోడ్డు … Read more

40 ఏళ్ల అనుబంధం కట్.. కారెక్కనున్న జీవన్ రెడ్డి..?

మన పత్రిక, TG: తెలంగాణ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 13న ఆయన భారత్ రాష్ట్ర సమితి కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. ముందుగా ఈ నెల 7న జగిత్యాలకు వెళ్లనున్న కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఈ చర్చలు వేగం పుంజుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు … Read more

నారాయణపేట: చిన్నారి అపహరణ.. చెరువు కట్టపై శవమై ప్రత్యక్షం!

మన పత్రిక, తెలంగాణ, క్రైం: నారాయణపేట జిల్లాలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య కలకలం రేపింది. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తేజశ్రీ (5) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిన్నారి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై లభ్యమవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. తేజశ్రీ తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లగా, చిన్నారిని తాతమ్మల వద్ద ఉంచారు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని … Read more

యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన బంగారం ధరలు!

మన పత్రిక: యుద్ధ ప్రభావంతో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం నాటికి 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,48,970 వద్ద ట్రేడ్ కాగా, 22 క్యారెట్ బంగారం రూ.1,36,550, 18 క్యారెట్ బంగారం రూ.1,11,730 వద్ద నమోదైంది. అయితే శుక్రవారం ఉదయం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 24 … Read more

యుద్ధం.. ఆకాశానంటుతున్న గ్యాస్, నూనె ధరలు

మన పత్రిక, TG: నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడి జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకవైపు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ దందా.. మరోవైపు వంట నూనెల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిని, వంటగది ఖర్చులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో అంతరాయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ అధికారిక ధర రూ.965 … Read more

పగలు ఎండ.. సాయంత్రం ఉరుములు, మెరుపులు

మన పత్రిక, వాతావరణం: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. India Meteorological Department (ఐఎమ్‌డీ) హెచ్చరికల ప్రకారం నేడు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశమూ ఉంది. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 36°C నుంచి 38°C వరకు నమోదవుతున్నాయి. Hyderabadలో పాక్షిక మేఘావరణం ఉండి, సాయంత్రం లేదా రాత్రి సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి మోస్తరు … Read more

IPL.. నేడు చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్

మన పత్రిక, స్పోర్ట్స్: పీఎల్ 2026 సీజన్‌లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. చెన్నైలోని చేపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సీఎస్కేకు కీలకంగా మారింది. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ చేతిలో ఘోర ఓటమి పాలైన చెన్నై, ఈసారి గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది. సారథి రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే జట్టు ఆశలు ప్రధానంగా స్టార్ ఆటగాళ్లపై నిలిచాయి. భారీ ధరకు జట్టులోకి వచ్చిన … Read more

Vijay Devarakonda: రణబాలి షూటింగ్.. విజయ్ దేవరకొండ ఫైట్ సీన్ లీక్

Ranabaali leaked video

మన పత్రిక: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి తాజాగా ఒక వీడియో లీకైంది. ప్రస్తుతం అనంతపురంలో శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రీకరణకు సంబంధించిన ఫుటేజీలో విజయ్ మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ లుక్‌లో, ఉగ్రరూపంతో కనిపిస్తున్నారు. లీకైన ఈ పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన వాయిస్ మోడ్యులేషన్, డైలాగ్ డెలివరీ పీక్స్‌లో ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఊర మాస్ డైలాగులతో పాటు ఆయన … Read more

సోషల్ మీడియా యూజర్లకు కేంద్రం షాక్: ఐటీ రూల్స్ సవరణ

మన పత్రిక వెబ్డెస్క్, న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హద్దులు దాటుతున్న ఫేక్ న్యూస్, విద్వేష ప్రసంగాలు (Hate Speech), వ్యక్తిత్వ హననాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఒకప్పుడు సమాచార విప్లవానికి వేదికైన సామాజిక మాధ్యమాలు ప్రస్తుతం డిజిటల్ అరాచకత్వానికి అడ్డాగా మారుతుండటంతో, అభ్యంతరకర పోస్టులు చేసే యూజర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు నేరుగా నోటీసులు జారీ చేసేలా 2021 ఐటీ నిబంధనలకు ప్రతిపాదిత సవరణల ముసాయిదాను కేంద్రం సోమవారం విడుదల చేసింది. ఈ కొత్త ఐటీ … Read more

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదలకు కసరత్తు

మన పత్రిక : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు సర్కార్ తీపికబురు అందించింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏతో పాటు ఇతర భారీ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి నిలిచిపోయిన ఈ బిల్లుల కోసం ఉద్యోగులు ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో, బకాయిల చెల్లింపులపై తగిన కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన … Read more