Advertisement

హైదరాబాద్‌కు మళ్లీ ఐమాక్స్ ప్రాసెస్

హైదరాబాద్ నగరంలో దశాబ్ద కాలం విరామం తర్వాత ఐమాక్స్ సినిమా అనుభవం మళ్లీ అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 70ఎంఎం థియేటర్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏఎమ్‌బీ విక్టరీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఈ ఐమాక్స్ విత్ లేజర్ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఏసియన్ సినిమాస్‌తో పాటు నటులు మహేష్ బాబు, వెంకటేష్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

డిసెంబర్ 18 నుంచి ప్రేక్షకాదరణకు సిద్ధం

ఈ ఏడు స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను 2026 డిసెంబర్ 18న ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఐమాక్స్ స్క్రీన్‌తో పాటు ఒక 4డీఎక్స్ స్క్రీన్, ఐదు సాధారణ స్క్రీన్లను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రదర్శించే తొలి చిత్రంగా హాలీవుడ్ మూవీ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ ఉండే అవకాశం ఉందని సమాచారం. అలాగే హకీంపేట్‌లోని ఏఎమ్‌బీ సినిమాస్‌లో కూడా మరొక ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement