మన పత్రిక: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 9 నుంచి ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి వివరాలు, ఖచ్చితమైన విడుదల తేదీపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రావాల్సి ఉంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి సౌజన్య సహ నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు శివాజీ, వాసుకి, శ్రీనివాస్ గవిరెడ్డి, కళ్యాణ్ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. డిజిటల్ విడుదలతో ఇతర భాషా ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చేరువయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
