Advertisement

షూటింగ్ మొదలవ్వకముందే భారీ రికార్డు సృష్టించిన ధనుష్ కొత్త సినిమా

మన పత్రిక: తమిళ స్టార్ హీరో ధనుష్ మరియు దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘D56’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నప్పటికీ, అంతకుముందే డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అనేక చిత్రాలు షూటింగ్ పూర్తయినా ఓటీటీ ఒప్పందాల కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ డీల్ కుదుర్చుకోవడం విశేషం. ఈ ఒప్పందంతో ధనుష్ తన మార్కెట్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారని, ఈ చిత్రం డిజిటల్ హక్కుల విషయంలో కొత్త రికార్డు నమోదైందని సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. సాయి పల్లవి, రుక్మిణి వసంత్, సారా అర్జున్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
Advertisement