Advertisement

తెలంగాణలో ఓటర్ల సవరణ గడువు పొడిగింపు

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మరోసారి సవరించింది. ఓటర్ల నమోదు, క్లెయిమ్‌లు అలాగే అభ్యంతరాల స్వీకరణ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సవరించిన తాజా షెడ్యూల్ ప్రకారం.. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించారు.

వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే ప్రక్రియను నవంబర్ 5 లోపు పూర్తి చేయనున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తిగా ముగిసిన తర్వాత రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న అధికారికంగా ప్రచురించనున్నారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ అదనపు గడువును రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు లేదా చేర్పుల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement