మన పత్రిక, హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌరసమాజానికి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. మ్యాప్‌లు, డేటాతో సహా ప్రాజెక్టు లక్ష్యాలను, ప్రయోజనాలను ఆయన సవివరంగా వివరించి అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
ప్రాజెక్టు వ్యయంపై బీఆర్ఎస్ చేస్తున్న లక్ష కోట్ల ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాపు ఘాట్ వద్ద ప్రతిపాదించిన మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణ వ్యయం రూ. 200 కోట్లకు మించదని, గాంధీ సరోవర్ వరకు జరిగే పనుల మొత్తం వ్యయం రూ. 5 వేల కోట్లకు లోపే ఉంటుందని వివరించారు. అలాగే పదివేల ఇళ్లను కూల్చేస్తున్నారన్న విమర్శలపై స్పందిస్తూ.. ఆక్రమణల్లో ఉన్న పేదలకు మోడల్ కాలనీలు నిర్మించి పూర్తి పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల మేర ‘మూసీ రివర్ కారిడార్’ నిర్మించనున్నారు. ఇది చార్మినార్, మక్కా మసీదు, హైకోర్టు, సెంట్రల్ లైబ్రరీ వంటి చారిత్రక ప్రాంతాలను కలుపుతూ పర్యాటక, నైట్ ఎకానమీ కేంద్రంగా మారనుంది. అంతేకాకుండా బాపు ఘాట్ వద్ద ఈసా, మూసీ నదులతో 5 నుంచి 10 టీఎంసీల గోదావరి జలాలను అనుసంధానం చేసి త్రివేణీ సంగమంగా తీర్చిదిద్దే ప్రణాళికను ముఖ్యమంత్రి వివరించారు. దీనివల్ల హైదరాబాద్‌కు తాగునీటితో పాటు, నల్గొండ రైతాంగానికి కాలుష్య రహిత జలాలు అందుతాయని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- NHPC Trainee Engineer Recruitment 2026: ఎన్‌హెచ్‌పీసీలో 81 ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీ
- CBSE Class 10 Results 2026 : సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2026 ఎప్పుడంటే?
- Brahmamudi March 14 Episode: రాఖీ నుంచి ఇందును కాపాడిన రాజు.. ఆస్తి లెక్కల్లో రేఖ
- Gold Rate Today – March 14, శనివారం బంగారం ధరలు!
- UstaadBhagathSingh : “నా కల… ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నెరవేరింది”! – రాశీ ఖన్నా
