మన పత్రిక, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 31న ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటన ఆధారంగా ఒక మైనర్ బాలిక కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు మే 8న ఈ చర్య తీసుకున్నారు.
అయితే, ఈ కేసు నమోదుకు కొన్ని గంటల ముందే భగీరథ్ కరీంనగర్ పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఒక పథకం ప్రకారం తనను హనీ ట్రాప్‌లో ఇరికించి, రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 50 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటన వేళ వెలుగుచూసిన ఈ వ్యవహారంపై పోలీసులు ప్రస్తుతం డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ రెండు ఫిర్యాదులపై లోతైన విచారణ జరుపుతున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
Advertisement
