రూ. 4.25 లక్షలకు కొన్న బంగళా ఇప్పుడు రూ. 450 కోట్ల ఆస్తిగా మారిన వైనం

ముంబైలోని పాలి హిల్‌లో జితేంద్ర కొనుగోలు చేసిన బంగళా స్థలం ప్రస్తుతం దాదాపు రూ. 450 కోట్ల విలువైన ఆస్తిగా మారింది.

హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్వీ భారీ నిరసన

ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న అణచివేతను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్వీ భారీ ఆందోళన చేపట్టింది.

ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఆక్వా, పొగాకు రైతుల కష్టాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీ కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

లూనార్ మిషన్‌కు ఎంపికైన ఏపీ విద్యార్థినిని అభినందించిన మంత్రి లోకేశ్

ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ గ్లోబల్ లూనార్ మిషన్‌కు ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించినందుకు ఆమెను మంత్రి లోకేశ్ అభినందించారు.

తెలంగాణలోని ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.