Advertisement

లూనార్ మిషన్‌కు ఎంపికైన ఏపీ విద్యార్థినిని అభినందించిన మంత్రి లోకేశ్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్థిని ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ లూనార్ మిషన్‌కు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ధవళేశ్వరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర మంత్రి లోకేశ్, జెస్సీని ప్రత్యేకంగా అభినందించారు.

శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయనున్న జెస్సీ

ఎంపికైన ఈ గ్లోబల్ లూనార్ మిషన్‌లో భాగంగా కందుల జెస్సీ మిషన్ శక్తిశాట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ అంతర్జాతీయ స్థాయి మిషన్‌లో భాగస్వామి కావడం పట్ల పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.

Advertisement
Advertisement