ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.1,930 కోట్లతో ఆ జిల్లా దశ తిరిగినట్లే!

మన పత్రిక వెబ్​డెస్క్, నెల్లూరు: నెల్లూరు నగర రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, నగర అభివృద్ధికి బాటలు వేసేలా కూటమి ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నెల్లూరు చుట్టూ దాదాపు రూ.1,930 కోట్ల భారీ వ్యయంతో 83.64 కిలోమీటర్ల మేర ‘ఔటర్ రింగ్ రోడ్డు’ (ORR) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎక్కడ మొదలై.. ఎక్కడ వరకు? ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల … Read more

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విజయవాడలో జరుగుతూ వచ్చిన స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలను ఈసారి నుంచి రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day) రాజధాని ముస్తాబవుతోంది. 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ రాజధానిలోని మంత్రుల బంగ్లాలకు ఎదురుగా ఉన్న 10 ఎకరాల సువిశాల స్థలంలో పరేడ్ గ్రౌండ్‌ను సీఆర్డీఏ … Read more

రాజకీయాలు మనవి కావు.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో మర్యాద, విలువలు, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ అసలైన విధానమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రులతో నిర్వహించిన అల్పాహార విందు సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పాలనలో అనుసరించాల్సిన విధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీ అనుసరిస్తున్న దౌర్జన్య రాజకీయాలకు టీడీపీ పూర్తి భిన్నమని, బెదిరింపులు, ‘రప్పా రప్పా’ సంస్కృతి తమకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రజాసేవే మన అజెండా ఎన్నికల్లో గెలిచామా లేదా … Read more

2,419 బస్సులు బంద్: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీకి బిగ్ షాక్..

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ (Sankranti) రద్దీ మొదలైన వేళ ఏపీఎస్ఆర్టీసీకి, ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పండుగ కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించిన ఆర్టీసీకి.. అద్దె బస్సుల యజమానుల నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు 2,419 అద్దె బస్సుల యజమానులు హెచ్చరిస్తున్నారు. పండుగ సమయంలో అత్యంత కీలకమైన అద్దె బస్సులు నిలిచిపోతే గ్రామీణ, పట్టణ ప్రాంత … Read more

ప్రణయ్ హత్య కేసు: అమృత బాబాయ్‌కి బెయిల్..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి, జీవిత ఖైదు అనుభవిస్తున్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు తనకు … Read more

Polavaram Project: డిసెంబర్ 2027 నాటికి పూర్తి – సీఎం చంద్రబాబు

మన పత్రిక వెబ్​డెస్క్, పోలవరం: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు, భద్రతా చర్యలను మంత్రులు, అధికారులతో కలిసి సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న అడ్డంకులను దశలవారీగా తొలగించి, పనులను తిరిగి గాడిలో పెట్టామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో దాదాపు 87 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు … Read more

అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు కీలక విజ్ఞప్తి!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) అభివృద్ధి, రాజధాని భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా కీలక అడుగులు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని అధికారిక రాజధానిగా ఖరారు చేస్తే, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవ్వడంతో పాటు … Read more

బర్త్ డే పార్టీ విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

మన పత్రిక వెబ్​డెస్క్, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలో (Rangareddy District) అర్ధరాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీకి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న విద్యార్థుల ప్రయాణం మృత్యుఒడిలో ముగిసింది. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీబీఏ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. మిర్జాగూడ గేట్ సమీపంలో అదుపుతప్పిన స్పోర్ట్స్ కారు చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. బర్త్ డే వేడుకల అనంతరం.. … Read more

TVK Chief Vijay CBI Inquiry: సీబీఐ నోటీసులు.. జనవరి 12న ఢిల్లీలో విచారణ

మన పత్రిక వెబ్​డెస్క్, చెన్నై: ప్రముఖ నటుడు, తవిక (TVK) అధినేత విజయ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బిగ్ షాక్ ఇచ్చింది. గతేడాది కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది అభిమానులు మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం … Read more

అమెరికాలో హత్యకు గురైన నిఖితా మృతదేహం హైదరాబాద్ కు.. నిందితుడు అరెస్ట్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: అమెరికాలోని మేరీల్యాండ్‌లో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ యువతి నిఖితా గోదిశాల (27) మృతదేహం నేడు (జనవరి 8) నగరానికి చేరుకోనుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో విదేశాంగ శాఖ అన్ని అనుమతులు జారీ చేసిందని, బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. నిఖితా తన మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మ చేతిలో న్యూ ఇయర్ ఈవ్ రోజున దారుణంగా హత్యకు గురైంది. … Read more