మన పత్రిక వెబ్‌డెస్క్, శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లాలో (Rangareddy District) అర్ధరాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీకి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న విద్యార్థుల ప్రయాణం మృత్యుఒడిలో ముగిసింది. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీబీఏ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. మిర్జాగూడ గేట్ సమీపంలో అదుపుతప్పిన స్పోర్ట్స్ కారు చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
బర్త్ డే వేడుకల అనంతరం.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలంలోని దొంతానపల్లిలో ఉన్న ఇక్ఫాయ్ (IBS) కళాశాలలో బిబిఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గురువారం కోకాపేటలో జరిగిన ఓ బర్త్ డే వేడుకకు హాజరయ్యారు. పార్టీ ముగిసిన అనంతరం రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఎంజీఐటీ (MGIT) కళాశాలకు చెందిన రోహిత్ అనే విద్యార్థి వారిని కారులో డ్రాప్ చేయడానికి వెళ్తుండగా, మిర్జాగూడ గేట్ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
మృతుల వివరాలు ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులను సూర్యతేజ (20), సుమిత్ (20), నిఖిల్ (18), రోహిత్ (20)గా గుర్తించారు. వీరిలో ముగ్గురు ఇక్ఫాయ్ విద్యార్థులు కాగా, రోహిత్ ఎంజీఐటీ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఇదే ప్రమాదంలో నక్షత్ర (20) అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
