Advertisement

మెల్బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం

మన పత్రిక, మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne) నగరంలో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్లు ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కో-ఆర్డినేటర్లను సత్కరించి, కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిలో తాము క్రియాశీలక పాత్ర పోషిస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు.

తమకు బాధ్యతలు అప్పగించినందుకు కూటమి ప్రభుత్వానికి కో-ఆర్డినేటర్లు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో రాష్ట్ర పురోగతికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ప్రవాసాంధ్రుల (Non-Resident Telugu) సహకారంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశం ఎంతో ఉత్సాహంగా సాగింది.

Advertisement
Advertisement