మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ వివరాలను ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌పోర్టల్‌తో పాటు ‘మన మిత్ర’ వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేసి కూడా తమ హాల్‌టికెట్లను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈసారి ఇంటర్నెట్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ హాల్‌టికెట్‌ను నేరుగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లవచ్చు. సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు రెండు సెషన్లలో (ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు) జరగనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షలను జూన్ 7 నుంచి జూన్ 11 వరకు నిర్వహించనున్నారు.
