Betting Loss : బెట్టింగ్‌లో లక్షలు కోల్పోయి సూసైడ్ చేసుకున్న యువకుడు

youth commits suicide after loosing lakhs in betting

Betting Loss : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ లో లక్షలు పెట్టి లాస్ అయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల అఖిల్ బెట్టింగ్ వల్ల చాలా నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. కానీ, సంగారెడ్డిలోనే ఓ  హోటల్ లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ … Read more

Olluru Royal Lake : తెగిన చెరువు కట్ట.. మునిగిన గ్రామం

flood waters surge into kalaaturu in Tirupati dist

Olluru Royal Lake : ఓ చెరువు తెగి గ్రామం మొత్తం మునిగిపోయింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలో ఉన్న ఒళ్లూరు రాయల్ అనే చెరువుకు గండిపడింది. దీంతో చెరువు పక్కనే ఉన్న కళత్తూరు అనే గ్రామం నీట మునిగింది. ఒక్కసారిగా వరద గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామస్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అందరూ ప్రాణభయంతో ఇళ్లపైకి ఎక్కారు. ఈనేపథ్యంలో వరద నీటికి పశుపక్ష్యాదులు కొట్టుకుపోయాయి.

Bike Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు యువకులు మృతి

two youth die after speeding bike collides with lorry in bapatla

Bike Accident : ఏపీలోని బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్ లో చనిపోయారు. బాపట్లలోని గడియారం స్తంభం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చీరాల రూట్ నుంచి వస్తున్న లారీని సూర్యలంక రూట్ నుంచి వస్తున్న బైక్ అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో రోడ్డు మీద పడిపోయిన ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి … Read more

ఉపాధ్యాయురాలి వివాదం.. కాళ్లు నొక్కించుకున్న ఘటన కలకలం

srikakulam teacher students massage incident

మన పత్రిక, వెబ్​డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా ఆగ్రహం రేపగా, విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించారు. అధికారులు సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Vizag Earthquake : వైజాగ్‌లో భూకంపం

mild earthquake in Visakhapatnam

Vizag Earthquake : వైజాగ్ లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 3.7 గా భూకంప తీవ్రత నమోదైంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వైజాగ్ లోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, అక్కయ్యపాలెం, విశాలాక్షినగర్, మహారాణిపేట లాంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఏలూరులో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 50 మంది ప్రయాణికులు!

ap eluru lingapalem private bus accident

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు (Eluru) జిల్లా, లింగపాలెం మండలం, జూబ్లీనగర్ వద్ద ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు … Read more

Couple Suicide : విషాదం.. యువజంట ఆత్మహత్య.. భార్య గర్భిణి

husband and wife suicide in Visakhapatnam

Couple Suicide : ఏపీలోని వైజాగ్ లో దారుణం చోటు చేసుకుంది. యువ జంట ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణి. అయినా కూడా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వీళ్లకు వివాహం జరిగింది. వైజాగ్ లోని అక్కయ్యపాలెం దగ్గర వీళ్లు ఉంటున్నారు. ఆ ఇంట్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Chittoor pocso case: నిందితుడికి 20 ఏళ్ల జైలు.. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు!

chittoor pocso case

మన పత్రిక, వెబ్​డెస్క్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిత్తూరు ఫోక్సో కోర్టు గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించింది. పిటిఎం మండలం మద్దయ్య గారిపల్లికి చెందిన పూలా నరేంద్ర రెడ్డి (31), అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి పేరుతో మోసం చేశాడు. 2023 నవంబర్ 29 లోపు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ … Read more

Jogi Ramesh Arrest: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్! ఏ1 వాంగ్మూలంతో..

Jogi Ramesh Arrest

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నకిలీ (jogi ramesh liquor case) మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో సెర్చ్ వారెంట్ అందజేసిన అనంతరం అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. “జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు … Read more

Nara Rohit Marriage: నారా రోహిత్ పెళ్లిలో కుటుంబంతో మెరిసిన నారా లోకేష్!

nara rohith marriage

మన పత్రిక, వెబ్​డెస్క్: నారా కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సోదరుడు నారా రోహిత్ వివాహ వేడుకకు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. హైదరాబాద్ అజీజ్‌నగర్‌లోని ‘ద వెన్యూ కన్వెన్షన్’లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులు నారా రోహిత్, శిరీషలను లోకేష్ ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి, సుఖసంతోషాలతో కూడిన వైవాహిక జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు … Read more