మన పత్రిక, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఏకంగా 12 మంది పోలీస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యంగా కోల్‌కతా పోలీస్ శాఖలో కీలకంగా వ్యవహరించే అధికారులను స్థానచలనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త నియామకాల ప్రకారం జాయింట్ కమిషనర్లుగా సోమా దాస్ మిత్రా (క్రైమ్), సుదీప్ సర్కార్ (హెడ్‌క్వార్టర్స్), దేవాస్మితా దాస్ (ఇంటెలిజెన్స్) బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు డిప్యూటీ కమిషనర్ (DC) స్థాయిలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డీసీలుగా వీఎస్ఆర్ అనంతనాగ్ (సౌత్), ప్రదీప్ కుమార్ యాదవ్ (నార్త్), సైకత్ ఘోష్ (సౌత్-ఈస్ట్), ప్రశాంత్ చౌధురి (ఈస్ట్) నియమితులయ్యారు. వీటితో పాటు రాష్ట్రంలోని మరికొన్ని పోలీస్ జిల్లాల్లోనూ ఎన్నికల భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేపట్టింది.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
