మన పత్రిక, న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. గతంలో ఆయన ఇంట్లో భారీగా నగదు పట్టుబడిన వ్యవహారంలో, సుప్రీంకోర్టు నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఆయనను దోషిగా తేల్చింది. ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను కొలీజియం మోడీ ప్రభుత్వంపై ఉంచింది.
ఆయనను చట్టబద్ధంగా తొలగించేందుకు అభిశంసన తీర్మానం వస్తుందని భావించినప్పటికీ, ఈలోపే ఆయన రాజీనామా చేసి తప్పుకున్నారు. కేవలం రాజీనామా చేయగానే అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయా అంటూ న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే క్రమంలో మోడీతో బెడిసికొట్టి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సైతం అవమానకరంగా వైదొలిగిన అంశాన్ని విమర్శకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. జడ్జి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు పారదర్శకంగా వ్యవహరించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- కరీంనగర్లో తుపాకులు కత్తులతో బెదిరించి కోటిన్నర విలువైన సొత్తు దోపిడీ
- తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురు
- విద్యార్థుల పేరుతో రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శ
- కిషన్ రావు పేట పంచాయతీ రికార్డుల మాయం
- తిరుమలలో భక్తుల రద్దీ: ఒక్కరోజే ఐదు కోట్ల పైగా హుండీ ఆదాయం
