మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు జిల్లాలైన తిరుపతి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, పరిశ్రమల ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలు కూడా ఈ ప్రయోజనం పొందనున్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం లక్ష్యం. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 19న, తమిళనాడు ఎన్నికలు 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పనిచేస్తున్న ఆయా రాష్ట్రాల ఓటర్లు సులభంగా తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు వేయగలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
