మన పత్రిక: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నుంచి ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం సివిల్ ఎన్‌క్లేవ్‌లో విమాన కార్యకలాపాలు ముగియనున్నాయి.
ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. రికార్డు స్థాయిలో 31 నెలల్లోనే ఈ విమానాశ్రయ నిర్మాణ ప్రాజెక్ట్ పూర్తయినట్లు సమాచారం లభించింది.
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుంది. అనంతరం ఆగస్టు 17 నుంచి ఇక్కడి నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు పూర్తిస్థాయిలో సాగనున్నాయి.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
