Advertisement

IPL.. నేడు చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్

మన పత్రిక, స్పోర్ట్స్: పీఎల్ 2026 సీజన్‌లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. చెన్నైలోని చేపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సీఎస్కేకు కీలకంగా మారింది. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ చేతిలో ఘోర ఓటమి పాలైన చెన్నై, ఈసారి గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది.

సారథి రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే జట్టు ఆశలు ప్రధానంగా స్టార్ ఆటగాళ్లపై నిలిచాయి. భారీ ధరకు జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, ఈ మ్యాచ్‌లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో ఎంఎస్ ధోనీ గాయం కారణంగా లేకపోవడం జట్టుకు పెద్ద లోటు. యువ ఆటగాడు కార్తీక్ శర్మ తన ప్రతిభను చాటుకునే అవకాశం ఉంది. గాయంతో దూరమైన డెవాల్డ్ బ్రెవిస్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

మరోవైపు కెప్టెన్శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది.అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ వంటి బౌలర్లతో వారి బౌలింగ్ బలంగా కనిపిస్తోంది.చేపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటం వల్ల ఇరు జట్లకు ఇది కీలక అంశం. అందువల్ల ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Advertisement