Advertisement

ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో 84 మండలాల్లో వడగాల్పుల తీవ్రత

మన పత్రిక అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో అల్లాడిన ప్రజలకు ఇప్పుడు భానుడి సెగలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. కొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42°C వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఉధృతమవుతున్న వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. త్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు. బయటకు వెళ్లాల్సి వస్తే వేడిగాలి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement